మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న నాగులు బాషల్లో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్లు మొదలుపెట్టనుంది. ఇక అసలు విషయానికి వస్తే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరూ అంటే అది నయనతారనే. అయితే ఈ ముద్దుగుమ్మ తాను నటించిన ఏ చిత్రానికి కూడా ఇప్పటివరకు ప్రమోషన్లు చెయ్యలేదు. కాని మొదటిసారి సైరా సినిమా కోసమని దీనికి ఒప్పుకుంది. ముంబై, చెన్నై లో ప్రమోషన్లు చేయడానికి తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నయనతారకు ఇష్టం లేకపోయిన ఇదంతా మెగాస్టార్ కోసమే చేస్తుందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.