ఏపీలో గ్రామ, వార్డు సచివాయాల్లో పోస్టుల భర్తీకి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఆరు రోజులపాటు నిర్వహించిన పరీక్షల ఫలితాలు రేపు వెలవడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షల ఫలితాలు సెప్టెంబర్ 18న ప్రకటించే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో కలిపి మొత్తం 19 రకాల ఉద్యోగాలకు 19,49,218 మంది హాజరయ్యారు. ఈ రాతపరీక్షలకు సంబంధించిన అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. స్కానింగ్ సెంటర్‌లో ప్రతి కదలిక సీసీ టీవీల ద్వారా రికార్డు చేస్తూ ఒక్కొక్క అభ్యర్థి ఓఎమ్మార్ షీటును మూడు విడతలుగా స్కాన్ చేసి.. అభ్యర్థులు ఏ ప్రశ్నకు ఏ జవాబు ఇచ్చారన్నది కంప్యూటీకరణ చేయడం పూర్తయిందన్నారు. అభ్యర్థుల వారీగా వచ్చిన మార్కులను కేటగిరి చేసే ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
