టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ ఈ వీక్ నామినేషన్‌కు అదిరిపోయే టాస్కులు ఇచ్చేసాడు. ఒకర్ని నామినేట్ చేయడం.. వాళ్లను సేవ్ చేయడానికి మరొకర్ని ఏదో ఒకటి త్యాగం చేయమనడం అనేది కండీషన్. దీంతో మంచి స్నేహితులుగా ఎవరినైనా చెప్పాలంటే, అందులో మొదట ఉండేది రాహుల్ – పునర్నవి జోడీయే. ఇక, వీరిద్దరి మధ్యా గత నాలుగైదు రోజులుగా గొడవలు రాగా, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ తో వీరిద్దరూ కలిసి పోయారు. అది కూడా అలా ఇలా కాదు. వీరి హగ్స్, కిస్ లు ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి. తన కోసం 20 కాకరకాయ జ్యూస్ లను రాహుల్ తాగగలడా? అని పునర్నవి వ్యక్తం చేసిన సందేహాన్ని పటాపంచలు చేస్తూ, రాహుల్ విజయవంతంగా టాస్క్ ను పూర్తి చేయగా, పునర్నివి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రాహుల్ ను గట్టిగా హత్తుకుని ముద్దు మీద ముద్దులు పెట్టింది. దీంతో వీరిద్దరి లేటెస్ట్ రొమాన్స్ పై సోషల్ మీడియాల్లో భారీ కామెంట్స్ వస్తున్నాయి.