మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 20న రానుంది. అయితే పూజా పై అప్పట్లో ఒక రూమర్ ఉండేది. అదేమిటంటే తాను ఏ సినిమాలో అడుగుపెట్టిన అది ఫ్లాప్ అవుతుందనే పుకారు ఉండేది. కాని అరవింద సమేత సినిమాతో ఆ పుకారుకు బ్రేక్ వేసింది. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమాలో నటించగా..అది బ్లాక్ బ్లాస్టర్ హిట్ కావడంతో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతేకాకుండా రంగస్థలం చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించి సినిమాకే హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం వాల్మికి చిత్రంలో కూడా మరో బాంబు పెల్చనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్. పూజా విషయంలో ఎలాంటి సస్పెన్స్ లేదని, ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటి అనేది నేను చెప్పలేను గాని సెకండ్ ఆఫ్ లో మాత్రం తనకంటూ ప్రత్యేక ఆకర్షణ ఉంటుందని అన్నారు.
