నూతన పురపాలక చట్టం-2019 పైన జరిగిన రెండ్రోజుల వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్పిపల్ కమిషనర్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పురపాలనలో పౌరుడే పాలకుడన్నారు. ప్రజలకు పౌరసేవలను పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా అందించడమే నూతన మున్పిపల్ చట్టం లక్ష్యమని అన్నారు. ప్రజల కోసం, పౌరసేవల కోసం, పాలనా సౌలభ్యం కోసం నూతన చట్టం పనిచేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షల కోసం మున్పిపల్ కమిషనర్లు పనిచేయాలని చెప్పారు. పురపాలనలో పౌర భాగస్వామ్యాన్ని పెంచాలని కోరారు. పట్టణాల మార్పు కోసం ఒక టీమ్‌గా పనిచేద్దామని పిలుపునిచ్చారు. పురపాలనలో ఆదర్శవంతమైన, వినూత్నమైన విధానాలతో ముందుకు పోదామన్నారు. మూడు నెలలకోసారి మున్పిపల్ కమిషనర్లతో రాష్ట్రస్థాయిలో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
MA&UD Minister @KTRTRS participated in the closing session of a two day workshop on ‘Orientation on New Municipal Act 2019’. The workshop was organised for the Municipal Commissioners of all the Urban Local Bodies of Telangana. 1/2 pic.twitter.com/WxhJp4R1nE
— Min IT, Telangana (@MinIT_Telangana) September 17, 2019