ప్రో కబడ్డీ సీజన సెవెన్ లో భాగంగా నిన్న దబాంగ్ ఢిల్లీ, తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఒకపక్క నవీన్ ఎక్ష్ప్రెస్స్ మరోపక్క సిద్దార్థ్ బాహుబలి ఉన్నారు. వీరిద్దరిని ఆపడం కష్టమని అనుకున్నారు అంతా. ఈవిధంగానే మ్యాచ్ కూడా చాలా రసవత్తరంగా సాగింది. చివరికి మ్యాచ్ మాత్రం ఢిల్లీ నే గెలిచింది. నవీన్ కుమార్ తన సూపర్ టెన్స్ రికార్డును కొనసాగిస్తున్నాడు. అటు సిద్ధార్థ్ దేశాయ్ కూడా సూపర్ టెన్ సాధించినప్పటికీ డిఫెన్స్ తప్పిదాలవల్ల మ్యాచ్ చేజారిపోయింది. నవీన్ కుమార్ రైడింగ్ స్కిల్ల్స్ తో మరోసారి జట్టును గెలిపించాడు.ఢిల్లీ పాయింట్స్ పట్టికలో మొదటి స్థానాన్ని పదిలంగా ఉంది.