సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు సోషల్ మెసేజ్ ఇచ్చిన చిత్రాలే. దాంతో మహేష్ కామెడీ ఫీల్డ్ లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో మహేష్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ చిత్రం తరువాత మహేష్ ఎవరితో తీస్తాడు అనే విషయం పై చాలా కధనాలు వస్తున్నాయి. కాని వీటన్నింటికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే మహేష్ సుకుమార్ కధను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగా కి కూడా నో చెప్పడం జరిగింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మహేష్ వంశీ పైడిపల్లి తోనే మరో సినిమా తీయనున్నాడని వార్తలు గట్టిగా వస్తున్నాయి.
