ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అంతక్రియలు నరసరావుపేటలో జరుగనున్నాయి. నిన్న హైదరాబాద్లోని తన ఇంటిలో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు గమనించి ఆయన్ని బసవతారకం ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించారు. కాగా ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ రోజు ఉదయం కోడెల తన ఇంటిలోని గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నట్లు ఆయన కుమార్తె వెల్లడించిరు. పోస్ట్మార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని బసవతారకం ఆసుపత్రి నుంచి ఉస్మానియాకు తరలించి, అనంతరం కోడెల భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్రస్ట్ భవన్ చేరుకుని, కోడెలకు నివాళులు అర్పించారు. అయితే అసలు కోడెల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత రెండు, మూడు రోజుల్లో కోడెల ఎవరి ఎవరితో ఫోన్ మాట్టాడినాడు..ఎక్కువగా ఎవరితో మాట్లడాడం జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆ కాల్ లీస్ట్ లో కోడెల ఆత్మహత్యకు సంబంధించి విస్తుగోలిపే సంచలన విషయాలు బయటపడడే అవకాశం ఉందని ఆయన అభిమానులు కోరుతున్నారు.
