తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వారి సతీమణికి జరిగిన అన్యాయాన్ని ఎవ్వరు పూడ్చలేరు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియచేసి, కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పడం, రాజకీయాలకు తావ్వివకుండా నడచుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. అయితే సహజ మరణం కాని పరిస్థితులలో విచారణ కోరడం, ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయడం ప్రభుత్వ కర్తవ్యం.
కానీ దీనినికూడా రాజకీయాలకు వాడుకోవాలని చూడటం టీడీపీ శవరాజకీయాలకు నిదర్శనం. ఒకపక్క కోడెల కుటుంబం శోకసంద్రంలో ఉంటే ఓదార్చి మిగతా కార్యక్రమాలు చూడవలసిన చంద్రబాబు ఇక్కడ కూడా రాజకీయాలు చేయడానికి ప్రయత్నించడం నిజంగా దౌర్భాగ్యం. కోడెలపై తప్పుడుకేసులు పెట్టారు, అసెంబ్లీ దొంగగా చిత్రీకరించారు, కుటుంబాన్ని వేధించారు, అందుకే ఆత్మహత్య చేసుకొన్నారని ముఖ్యమంత్రిపై బురద చాల్లే కార్యక్రమం చంద్రబాబు చేయడం సగటు టీడీపీ కార్యకర్తను. కోడెల అభిమానులను కలచివేసింది.
వాస్తవానికి ఎన్నికల సందర్భంలోనే కోడెలకు టికెట్ నిరాకరించడం, వారు పట్టుపట్టి కోరడం తర్వాత టికెట్ ఇవ్వడం.. కోడెల ఓడిపోయిన తరువాత వారి కుమారుడు, కుమార్తె చేసిన దుర్మార్గాలు బయటికి రావడం, అసెంబ్లీ ఫర్నిచర్ కుమారుడి దుకాణంలో పట్టుపడటం, ప్రభుత్వంపై పోలీస్ శాఖపై భాదితుల నుండి ఒత్తిడి పెరిగి కేసులు పెట్టడం, ఇవ్వన్నీ జరుగుతుంటే పార్టీ పెద్దలు అండగా నిలువలేదనేది వాస్తవం.. చంద్రబాబు కనీసం మర్యాదపూర్వకంగా పలకరించలేదట.. ముఖ్యంగా కోడెలతో అన్నీ చేయించి ఇబ్బందుల్లోకి వెళ్లాక వదిలేయడం కచ్చితంగా జరిగింది. గుంటూరులో పల్నాడు వైసీపీ బాధితుల శిబిరం అంటూ డ్రామాలాడినపుడు కోడెలను పిలవకపోవడం, చలో ఆత్మకూరు కార్యక్రమం పెట్టుకున్నా కోడెలను పూర్తిగా విస్మరించడం వంటివి జరిగాయి.
పార్టీపరంగా కోడెలను ఏకాకిగా చేయడం, ఎవ్వరు పలకరించకపోవడం, పార్టీ ఆరంభంనుండీ అంటిపెట్టుకొని వున్న వ్యక్తిని తీవ్ర మనస్తాపం కలుగచేసి అబద్రతా భావంలోకి నెట్టివేసిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ అందరికీ తెలిసినా కోడెలకు ఫోన్ చేసి పలకరించాను.. చలో ఆత్మకూరు గురించి ప్రస్తావించానంటూ మాట్లాడారు.. సానుభూతికోసం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవటానికి ఇప్పుడు కోడెల చనిపోయాక చంద్రబాబుకు పల్నాడు పులిలా కనిపించాడట.. కోడెల మరణానికి, ఆయన అనుభవించిన మానసిక క్షోభ, ఒంటరితనం ముఖ్య కారణాలు. దానికి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రజలకు జవాబు చెప్పే సమయం కచ్చితంగా వస్తుందని కోడెల అభిమానులు చెప్పుకుంటున్నారు.