ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి చెందారు. గతంలో కోడెల చేసిన కొన్ని వ్యవహారాలు ఈ సందర్భంగా బయటకు వస్తున్నాయి.. ఏ మనిషయినా చనిపోయినపుడు వారి మంచి చెడులు ప్రస్తావనకు వస్తాయి. అయితే మిష్టరీగా మిగిలి ఆరోపణలు ప్రత్యారోపణలతో నడుస్తున్న కోడెల డెత్ మిష్టరీ సందర్భంగా పలువురు ఆయన గురించి తమతమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట ప్రాంతంలో కోడెల తన అనుచర గణాన్ని భారీగా పెంచుకున్నారు.
గతంలో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల అప్పటినుంచి పల్నాడులో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అయితే గతంలో వైఎస్ తో కోడెలకు రాజకీయ విబేధాలు ఉండేవట.. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో కోడెలకు వైరం ఉండేదట.. ఈ క్రమంలో కోడెల 2009 సెప్టెంబర్ లో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన పల్నాడు లో మూడురోజుల పాటు సంబరాలు నిర్వహించారని, భారీఎత్తున బాణసంచా కూడా కాల్చారంటూ పలు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
తాజాగా వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా శ్రేణులు ఈ వార్తలు ప్రచారం చేస్తున్నారు. తాజాగా కోడెల మరణించిన నేపధ్యంలో ఈ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఏదేమైనా రాజకీయాలకతీతంగా అందరూ కోడెలకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మరణం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.