ఇటీవలే కోడెల మరియు అతని కుటుంభం వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, అతడిని సస్పెండ్ చెయ్యాలని టీడీపీ నాయకులు కొందరు అతడిపై వత్తిడి తీసుకొచ్చారు. కచ్చితంగా సస్పెండ్ చెయ్యాలని చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో కోడెలతో అన్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి కోడెల కూడా చంద్రబాబుతో వాగ్వాదానికి దిగాడని తెలుస్తుంది. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అంత దారుణంగా ఓడిపోవడానికి గల కారణం మీ తండ్రీకొడుకులేనని…అప్పట్లో ఓటుకు నోటు కేసులో మీరు దొరికిపోయినప్పుడే పార్టీ పరువు మొత్తం పోయిందని చంద్రబాబుని గట్టిగా నిలదీసినట్టు సమాచారం. ఈ సందర్భంలోనే కోడెల…బాబు నన్ను ఎంతాగానో వాడుకున్నాడని, చివరికి కేసులు చుట్టుముట్టేసరికి బాబు నెమ్మదిగా పక్కకి తప్పుకున్నాడని, నన్ను సస్పెండ్ చేస్తానని చెప్పడం నన్ను ఎంతగానో మానసికంగా భాధకు గురిచేసిందని కోడెల తన స్నేహితులు దగ్గర చెప్పుకొని భాదపడ్డారని వార్తలు జోరుగా వస్తున్నాయి.