టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ ఎవరు అనే విషయానికి వస్తే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది చైతు సమంత జంటనే. వారికంటూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక సమంత విషయానికి వస్తే టాలీవుడ్ లో అడుగుపెట్టిన తన మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు సంపాదించింది. తాను నటించిన ప్రతీ చిత్రం మొదటి చిత్రంగానే పరిగణించాలని అప్పుడే జీవితంలో పైకి రాగలము అనే ఆలోచనలు సమంతవి. చైతు సామ్ జంటగా కొన్ని సినిమాలు కూడా చేసారు. అనంతరం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. దాంతో అక్కినేని కోడలుగా సమంత అడుగుపెట్టింది. పెళ్లి తరువాత కూడా తన క్రేజ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికి కూడా లేడీ ఓరిఎంటెడ్ చిత్రాల్లో నటిస్తూ తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. ఇక అసలు విషయానికి వస్తే చైతూ సమంతను కిస్ చేసిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటో పాతదే అయినప్పటికీ మరోసారి కనిపించడంతో ఫాన్స్ కామెంట్స్ కు హద్దులు లేకుండా పోతున్నాయి. మిస్ యూ సమంత, చైతూ లక్కీ బాయ్ అంటూ కామెంట్స్ చేస్తూ చైతుపై ఈర్ష్య చూపుతున్నారు.
