ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు వర్తించనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏపీలో అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు మరియు ఇతర విద్య సంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9వరకూ దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
