బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ టైటిల్ గెలుపొంది సెన్సేషన్ క్రియేట్ చేశాడు. హౌజ్ లో ఉన్నప్పుడు బయట సోషల్ మీడియాలో అతగాడికి ఉన్న క్రేజ్ మాములుగా లేదు. ఓ హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది. దానిని బాగా వాడుకుందామని కౌశల్ చూసినా అది అతనికి చేతకాలేదు. ఇంకా చెప్పాలంటే ఏదో చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు. అందరి ముందు అభాసుపాలు అయ్యాడు. ఇంత జరిగినా కౌశల్ మాత్రం ఇంకా బిగ్ బాస్ కిక్కులోనే ఉన్నాడు. అతని మాటలు గమనిస్తుంటే.. ఇంకా ఆ మత్తునుంచి తేరుకున్నట్లుగా కనిపించటం లేదు.
ఇంతకీ విషయం ఏమిటంటే…తాజాగా ఓ రిపోర్టర్ కౌశల్ ని బిగ్ బాస్ 3 విన్నర్ పై ఎవరు గెలుస్తారని , ఆ రేస్ లో ఉన్న ముగ్గురి పేర్లు చెప్పని కోరింది. దీంతో కౌశల్ అవాక్ అయ్యే సమాధానం చెప్పారు. తాను ఒకరి పేరు చెబితే తన ఆర్మీ వాళ్లకే ఓటు వేస్తుందని, దీంతో మిగతా వారికి అన్యాయం జరుగుతుందని సమాధానం చెప్పారు. ఈ మాటలకు కౌశల్ పై సోషల్ మీడియా సెటైర్లు వేస్తుంది. ఇంకా అదే భ్రమలో ఉన్నావా.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. కొందరు మాత్రం బాగా చెప్పావని అంటున్నారు.