గడిచిన సీజన్స్ కంటే బిగ్ బాస్ సీజన్ 3 కాస్త చప్తగా సాగుతుందన్నది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.ఇప్పటికే సగం రోజులు గడిచినా..చెప్పుకోదగ్గ పుటేజ్ మాత్రం అందటం లేదు జనాలకి… అయితే రోజులు దగ్గరపడుతున్నా కొద్ది సీజన్ 3 ఆ ఇద్దరి వల్ల షో కాస్త రక్తికడుతుంది. వారిద్దరి గొడవలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వారే రాహుల్, పున్ను. ప్రస్తుతం సోషల్ మీడియాలో, హౌజ్ లో వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ హట్ టాఫిక్ గా మారుతుంది.
తాజాగా పున్ను, రాహుల్ ల మధ్య మొన్న జరిగిన టాస్క్ విషయంలో చిరాకు, చీవాట్లు కాస్త ఎక్కువయ్యాయి.. పున్ను మాటలకి రాహుల్ హట్ అయ్యాడు. ఇక తనతో మాట్లాడవద్దని డిసైడ్ అయ్యాడు. పున్నూ కూడా సేమ్ అదే ఫీలింగ్ లో ఉండింది.ఆ గొడవ కాస్త వారిద్దరి మధ్య చాలా దురాన్ని పెంచింది. దీంతో బిగ్ బాస్ మంచి పుటేజ్ మిస్ అయ్యాడు. అందుకే మళ్లీ వారిద్దరిని కలిపే ప్రయత్నం చేశాడు.
పున్నూ కోసం 20 గ్లాసుల కాకరకాయ రసం తాగాలని షరతు పెట్టారు. ఈ టాస్క్ లో పున్నూ చేత చేతకాని వాడని మాటలు తప్ప చేతలు రావని అనిపించుకున్న రాహుల్..పున్నూ కోసం కాకరకాయ రసం తాగాడు. దీంతో పున్నూ..ఇంప్రెస్ అయిపోయింది. కోపం మొత్తం పోయి ఏకంగా రాహుల్ ని హాగ్ చేసుకుని ముద్దులు పెట్టింది. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ ముద్దు సీన్ పై విపరీతమైన కామెంట్స్ , మేమ్స్ రెఢీ అవుతున్నాయి.