ఎవరినైనా సరే తన అవసరాలకు వాడుకోవడం..అవసరం తీరాకా…వదిలేయడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అంటారు. తన అవసరం ఉన్నంత వరకు వారితో సన్నిహితంగా మెలుగుతారు…ఇక వారితో అవసరం తీరిందా..కన్నెత్తి కూడా చూడరు. చేరదీసి, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు నమ్మకస్తుడిలా ఉంటూ..ఆయనకే వెన్నుపోటు పొడిచి, సీఎం పదవి నుంచి దించేసి, తెలుగు తమ్మళ్లతో చెప్పులు వేయించి, ఆయన మరణానికి కారకుడు అయిన చంద్రబాబు..మళ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం నిస్సిగ్గుగా ఎన్టీఆర్ పేరును వాడుతారు. బాబుగారి వాడకం అలా ఉంటుంది. ఇక మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు విషయంలో స్వయాన ఆయన కుమారుడు హరికృష్ణనే ఆయుధంగా వాడారు. తర్వాత సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత హరికృష్ణను ఎంతగా అవమానించి పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉండేటట్లు చేసి, ఆయన మానసిక క్షోభకు కారకుడు అయ్యాడు చంద్రబాబు. ఒక్క హరికృష్ణనే కాదు..ఆయన కుమారుడు..సినిమాల్లో క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను ఎలక్షన్ల ప్రచారంలో వాడుకునాడు.. తీరా ఎన్నికలయ్యాక..తన కొడుకుకు పోటీ వస్తాడనే భయంతో నందమూరి కుటుంబానికి కూడా దూరం చేసిన ఘనుడు..చంద్రబాబు. ఇక టీడీపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన కోడెల వంటి సీనియర్ నేతలను కూడా తన అవసరం మేరకు ఉపయోగించుకుని..తీరా ఆయనకు ఇబ్బంది వచ్చేసరికి దూరం పెట్టి ఆయన్ని అవమానించిన చరిత్ర చంద్రబాబుది..పల్నాడులో పార్టీ బలోపేతానికి కోడెలను ఉపయోగించుకున్నంతగా బాబు ఇంకెవరిని వాడలేదు.రంగా హత్య ఘటనలో కూడా బాబు కోడెల సహకారం తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
ఎందుకో బాబు ఎవర్ని ఓ పట్టాన నమ్మడు. కోడెల వంటి బలమైన నాయకులు అంటే ఎందుకో బాబుకు భయం. పార్టీలో తాను మాత్రమే సుప్రీం..మిగతావారంతా తన స్థాయిలో ఉండకూడదనే అహంభావం చంద్రబాబుకు ఉంటుంది. అందుకే ఎంత సీనియర్ అయినా..అవసరం ఉన్నంత వరకే వారితో సన్నిహితంగా ఉంటాడు..వారితో అవసరం తీరిపోయిందంటే..ఇక వారిని పట్టించుకోడు. కోడెల విషయంలో కూడా అదే పాటించాడు బాబు. అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో ఇబ్బందుల్లో పడిన కోడెలకు చంద్రబాబు పార్టీపరంగా మద్దతు ఇస్తే..ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. పైగా వర్ల రామయ్య, సత్తెనపల్లి, నరసరావుపేట టీడీపీ నాయకులచేత అసెంబ్లీ ఫర్నీచర్‌ను తరలించడం ముమ్మాటికి తప్పు అంటూ, కోడెల కొడుకు, కూతురు అవినీతి, అరాచకాలు అంటూ ప్రెస్‌మీట్లు పెట్టించి..వాటిని ఎల్లోమీడియాలో ప్రసారం చేయించి..ఆయన మానసిక క్షోభకు గురి చేసాడు చంద్రబాబు. కనీసం 100 రోజులుగా కోడెల వంటి సీనియర్ నేతకు చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదంటే…చంద్రబాబు కోడెలను ఎలా అవమానించాడో అర్థమవుతుంది. అంతే కాదు మీ ఫ్యామిలీ వల్ల పార్టీ పరువు పోతుంది..మిమ్మల్ని సస్పెండ్ చేయమని..మీ సత్తెనపల్లి, నరసరావుపేట టీడీపీ నేతలే చెబుతున్నారు…ఏం చేద్దామో చెప్పండి అంటూ బాబు, కోడెల ముఖం మీదే చెప్పినట్లు ఆయన అనుచరులు అంటున్నారు. అందుకే ఒక పక్క కేసులు, మరోపక్క చంద్రబాబు నిరాదరణతో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్యకు పాల్పడినట్లు నరసరావుపేట ప్రజల్లో చర్చ జరుగుతోంది.కోడెల చరమాంకం టీడీపీ నేతలందరికీ గుణపాఠం కావాలి…బాస్ చెప్పాడని చెలరేగిపోయే తెలుగు తమ్ముళ్లు అంతా కోడెల ఆత్మహత్యతో కళ్లు తెరవాలి..అవసరం ఉన్నంత వరకు వాడుకుని, తీరా అవసరం తీరాకా కరివేపాకులా తీసివేసే బాబు మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వాడుకుని వదిలేసే ఇలాంటి నేత కింద ఆత్మాభిమానం చంపుకుని పని చేయడం ఎందుకనేది తమలో తాము ఆత్మవిమర్శ చేసుకోవాలి..లేకుంటే చంద్రబాబు వాడకానికి మీరు బలైపోతారంతే..తస్మాత్ జాగ్రత్త.