ఎంతో ప్రజాకర్షణ కలిగివుండే సినిమా, టీవీ రంగాల్లో ప్రేమ వివాహాలు చాలా జరిగాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం, పరస్పర అవగాహనతో ఎన్నో జంటలు ఒక్కటయ్యాయి. అదే సమయంలో ఎవరన్నా అమ్మాయి, అబ్బాయి కొద్దికాలం కలిసి పనిచేస్తే వాళ్లపై ఊహాగానాలకు లెక్కే ఉండదు. ఆర్టిస్టులు కాబట్టి వాళ్లకు సంబంధించిన చిన్న విషయం అయినా ప్రజల్లోకి త్వరగా వెళుతుంది. కొందరు తమ మధ్య ఏమీ లేదని చెప్పినా, వాళ్లపై రూమర్లకు మాత్రం అడ్డుకట్టపడదు. అలాంటి వాళ్లే సుడిగాలి సుధీర్, రష్మీ. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షోకు చెందిన ఏ ఆర్టిస్ట్ మీడియా ముందుకు వచ్చినా సుధీర్-రష్మి టాపిక్ ప్రస్తావన వస్తుంది. తాజాగా జబర్దస్త్ అప్పారావుకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. మనది గ్లామర్ ప్రపంచం, ఇక్కడ గ్లామర్ ఎంత ఉంటుందో… రూమర్ అంతే ఉంటుంది. వారిద్దరి జరిగింది ఏమీ లేదు. ఒక స్కిట్ కారణంగా ఈ రూమర్ వచ్చింది. అలా రష్మి-సుధీర్ మీద రూమర్లు పెరుగుతూ పోయాయి అని అప్పారావు చెప్పుకొచ్చారు. అంతేకాదు సుధీర్ స్కిట్ అయినపుడే స్టేజీ ఎక్కుతాడు. అప్పటికప్పుడు చేసేస్తాడు. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తారు. అక్కడ కూర్చుని రష్మితో మాట్లాడటం, ఎటైనా వెళ్లడం ఏమీ ఉండదు. షూటింగ్ అయిన తర్వాత ఎవరిదారిన వారు పోతారని అప్పారావు తెలిపారు.
