హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఆదివారం నాడు వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్ ఇప్పటివరకు 9 సిఎమాలు చెయ్యగా అందులో ఏఒక్కటీ మాస్ చిత్రం కాదు. ఇక వరుణ్ తీసిన లోఫర్ విషయానికి వస్తే ఆ చిత్రం పూర్తి మాస్ ఫాలోయింగ్ సినిమా కాదు. తన కెరీర్ లో మొదటిసారి మాస్ మూవీ తీస్తున్న వరుణ్ ఇందులో నెగటివ్ రోల్ లో కనిపించానున్నాడట. వరుణ్ చెప్పిన ఒక్క డైలాగ్ ” మాస్ సినిమా చేసిన కిక్కే వేరప్పా” అనే డైలాగ్ తోనే ఇది ఎంత మాస్ గా ఉండబోతుందో అర్ధమవుతుంది. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…బాబాయ్ పవన్ కి గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ ఎప్పుడు ఈ సినిమాకు డైరెక్ట్ చెయ్యడం చాల ఆనందంగా ఉందని, అంతేకానుండా ఇది నా మొదటి మాస్ సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయని అన్నారు. చిరంజీవి గారు మీమందరం మాస్ చిత్రాలు ఎందుకు చేస్తున్నామో నీకు అర్ధంకాదురా అనేవారు. అలా అప్పుడు ఎందుకు అన్నారో ఇప్పుడు బాగా అర్దమవుతందని వరుణ్ అన్నాడు. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
