ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ నిన్నటితో ముగిసింది. ఐదో టెస్ట్ నాలుగు రోజుల్లోనే ఇంగ్లాండ్ గెలుచుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమానం చేసింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1972 తరువాత యాషెస్ సిరీస్ సిరీస్ డ్రా అవ్వడం ఇదే మొదటిసారి. కాగా జోఫ్రా ఆర్చర్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 135 పరుగుల తేడాతో గెలిచంది. స్మిత్ ఆడుకుంటాడు అనుకుంటే తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. మరోపక్క మాథ్యూ వేడ్ 117 చేసినప్పటికీ తన శ్రమ వృధా అయిందనే చెప్పాలి.
