టీ20 సిరీస్ లో భాగంగా ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఆదివారం నాడు మొదటి మ్యాచ్ ధర్మశాల లో జరిగిన విషయం తెలిసిందే. వర్షం కారణం ఈ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ రద్దు అనంతరం మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియా సాక్షిగా తనలో ఉన్న కోరికను బయటపెట్టాడు. అదేమిటంటే టీమిండియా ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ ఆడినా ప్రతీ మ్యాచ్ మేమే గెలవాలని తన మనసులో మాట చెప్పాడు. దీంతో ఒక్కసారిగా మీడియా వాళ్ళు షాక్ అయ్యారు. ఆట ఆడే ప్రతీఒక్కరు ఎక్కడికి వెళ్ళినా మేమే గెలవాలని అందరు అనుకుంటారని, ఆ ఆలోచనతోనే ఆట ప్రారంభిస్తారని కామెంట్స్ వస్తున్నాయి.
