తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో యూరేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ తీర్మానం చేశారు. దీనికి సంబంధించి తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమ వారం ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా యూరేనియం తవ్వకాలపై ప్రజల్లో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. మేము ఎవరికి యూరేనియం తవ్వకాలపై ఎవరికి అనుమతులు ఇవ్వలేదు.
భవిష్యత్తులో ఇవ్వబోం “అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” దీనికి సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతున్నాం. నల్లమల అడవి మాత్రమే కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి. అడవులను ఏ మాత్రం ముట్టనివ్వం. ఒకవేళ కేంద్రం బలవంతంగా తవ్వడానికి ముందుకొస్తే పోరాటానికి యావత్ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.