నా బిడ్డను కడసారిగా నేను చూసుకోవాలి, అల్లారుముద్దుగా పెంచుకున్నా, క్లాస్ ఫస్ట్ సార్, స్కూల్ ఫస్ట్ సార్.. ఈ ఘటనకు కారణమైన వెధవల్ని వదిలిపెట్టొద్దు సార్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు సార్.. అంటూ ఓ తల్లి సీఎం జగన్ ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. గోదావరిలో బోటు బోల్తాపడిన ప్రమాదంలో బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. క్షతగాత్రులు రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర మానసిక వేదనలో ఉన్నారు. జగన్ రాకతో వారంతా అధికారుల నిర్లక్ష్యంపై జగన్ కు ఫిర్యాదు చేశారు. కన్నబిడ్డను కోల్పోయిన ఓ తల్లి ఆవేదన విని జగన్ చలించిపోయారు.
