పల్నాడులో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ…పునరావాస కేంద్రాలు తెరిచి…ఛలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడిన సంగతి తెలిసిందే. గ్రామస్థాయిలో జరిగిన వ్యక్తిగత కక్షలకు రాజకీయ రంగు పులిమి వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేశాడు. అయితే పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి పునరావాస కేంద్రాల్లోని టీడీపీ కార్యకర్తలను వాళ్ల ఊళ్లకు పంపించారు. దీంతో ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగింది. అయితే పల్నాడులో టీడీపీ కార్యకర్తలే భౌతిక దాడులకు తెగబడుతున్నట్లు తాజాగా జరిగిన ఓ సంఘటన చెబుతోంది. గుంటూరు జిల్లా నగరం మండలం, చల్లమ్మ అగ్రహారం గ్రామంలో విధుల్లో ఉన్న గ్రామవాలంటీర్‌పై ఓ టీడీపీ కార్యకర్త కత్తితో బెదిరించి హత్యాప్రయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.. వివరాల్లోకి వెళితే చంద్రబాబు హయాంలో.. దొంతుబోయిన నాగబాబురెడ్డి, బురకాయలరెడ్డి అనే టీడీపీ కార్యకర్తలు సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించుకున్నారు. అప్పుడు సొంత ప్రభుత్వం ఉన్నా వారికి సాయం అందలేదు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కొత్తగా గ్రామవాలంటీర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్రామవాలంటీర్లు గ్రామాల్లో తిరుగుతూ.. ప్రభుత్వం అమలు చేసే పలు పథకాలకు అర్హులైన వారి పేర్లతో జాబితా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త అయిన దొంతుబోయిన నాగబాబురెడ్డి గత ప్రభుత్వంలో నిర్మించుకున్న తమ ఇంటికి బిల్లులు అందించాలని వాలంటీర్ కుంచల వెంకటనాంచారెడ్డితో గొడవకు దిగి, కత్తితో బెదిరించాడు. అయితే గత ప్రభుత్వంలో నిర్మించిన ఇంటికి ఇప్పుడు బిలా ఎలా వస్తుందంటూ ఆ గ్రామ వాలంటీర్ టీడీపీ కార్యకర్తను ప్రశ్నించాడు. అంతే తమ ఇండ్లకు బిల్లులు శాంక్షన్ చేయించకపోతే చంపుతానంటూ సదరు టీడీపీ కార్యకర్త వీరంగం సృషించాడు. దీంతో భయపడిన సదరు గ్రామవాలంటీర్ తనపై హత్యాప్రయత్నానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అధికారం మారినా.. పల్నాడులోటీడీపీ కార్యకర్తలు మారలేదు. కత్తులతో తిరుగుతూ, ప్రజలను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ…భౌతిక దాడులకు, హత్యాప్రయత్నాలకు కూడా వెనుకాడడం లేదు. మొత్తంగా పల్నాడులో టీడీపీ కార్యకర్తలే భౌతిక దాడులకు తెగబడుతూ..వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నట్లు అర్థమవుతుంది. పల్నాడులో గ్రామవాలంటీర్‌పై టీడీపీ కార్యకర్త చేసిన హత్యాప్రయత్నంతో చంద్రబాబు బండారం బట్టబయలైంది. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో టీడీపీ కార్యకర్తలే అరాచకం సృష్టిస్తూ..పైకి పునరావాస కేంద్రాలు అంటూ డ్రామాలు ఆడుతూ..వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారంటూ…ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.