వారం ప్రారంభరోజైన సోమవారం ఉదయం ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 37,171వద్ద ట్రేడవుతుంది. నిప్టీ అరవై పాయింట్ల నష్టంతో 11,016 వద్ద కొనసాగుతుంది. యఎస్ బ్యాంకు,రిలయన్స్ ఇండస్ట్రీస్,టాటా స్టీల్ ,టాటా మోటర్స్ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడమే మార్కెట్లు నష్టాల బాట పట్టడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
