మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’ . ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ తనయుడు ఈ చిత్రానికి గాను నిర్మాణ భాద్యతులు తీసుకున్నారు. ఇది అలా ఉండగా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు నాలుగు భాషల్లో రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అయితే అందరికి తెలిసిన విషయం ఏమిటంటే ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో నిర్వహించాలని అనుకున్నారు. కాని తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ మారిందని సమాచారం. సెప్టెంబర్ 22న పెడుతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో 18 నుంచి వర్షాలు ఎక్కువగా పడే అవకాసం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.