విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లాలో టూరిస్టులతో ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ట లాంచీ కచులూరు వద్ద జరిగిన ప్రమాదంలో మునిగిపోయింది.ఈ బోటు ప్రమాదం పెను విషాదానికి దారితీసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. రెండు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి చెందడం, ఆచూకీ తెలియకుండా పోవడం కలచి వేసింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదస్థలం వద్ద సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
ఈ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ స్పందించారు. “ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి” అని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఈ రోజు జరిగిన బోటు ప్రమాదం ఒక అతి బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
— Narendra Modi (@narendramodi) September 15, 2019