తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలు. అయితే ఈ అంశంపై బీజేపీ,టీడీపీతో సహా కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో భాగంగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు నల్లమల అడవిలో యూరేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది. అది పర్యావరణానికి.. ప్రజలకు హానీకరమని వారు వాదిస్తూ వచ్చారు. దీనికి సమాధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో.. మంత్రి కేటీఆర్ మండలిలో సమాధానాలు ఇచ్చారు.
మండలిలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికీ యూరేనియం తవ్వకాల గురించి అనుమతులు ఇవ్వలేదని”ఆయన అన్నారు. ఎవరికి భవిష్యత్ లో కూడా ఇవ్వము. అసలు అప్పటి ఉమ్మడి ఏపీలో యూరేనియం తవ్వకాలకు అనుమతులిచ్చిందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా అని ఆధారాలను చూపిస్తూ కాంగ్రెస్ కుట్రలను బయట పెట్టారు”మంత్రి కేటీఆర్.