ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మృతి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోడెల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక కోడెల మృతదేహానికి హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం కోడెల పార్ధివదేహాన్ని ఎన్టీఆర్ భవన్ కు తరలించారు.
Saddened by the sudden demise of Ex-Speaker of AP Assembly Sri Kodela Siva Prasada Rao. My heartfelt condolences to the family members
— KTR (@KTRTRS) September 16, 2019