ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల శివప్రసాద్ గతకొద్ది రెండు రోజుల క్రితం కోడెల శివరాం పిలవడంతో హైదరాబాద్ కి వచ్చాడని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత కోడెల కొడుకు శివరాంతో వాగ్వాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే కోడెలకు, కొడుకు శివరాం కు ఘర్షణ తలెత్తిన వివాదంలో శివరాం చేసుకున్నాడని అందుకు కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ప్రచారం జరుగుతుంది. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు. ఇంటి పక్కనే ఉన్న నిమ్స్ హాస్పిటల్ కాకుండా ఆత్మహత్య చేసుకున్న వచ్చిన క్యాన్సర్ హాస్పటల్ కు ఎందుకు తీసుకు వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలింది. మరోవైపు ఇప్పటివరకు కూడా కోడెల శివరాం హాస్పిటల్ కి రాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కోడెల కోడుకు బసవతారకం ఆస్పత్రికి రాలేదని తెలుస్తోంది. తండ్రి విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో ఉన్నా కొడుకు ఎందుకు రాలేదు? ప్రస్తుతం కోడెల కొడుకు ఎక్కడ ఉన్నాడు? తండ్రి మృతి విషయం అతనికి తెలుసా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కోడెలను అత్యవసరంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్చడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి దురుసు ప్రవర్తన కలిగిన కోడెల శివరాం కారణంగా మనస్థాపానికి గురై చనిపోయారా అనేది ప్రస్తుతం తేలాల్సివుంది. ఇటీవల జరుగుతున్న నేపథ్యంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక అసలు నిజాలు బయటకు రానున్నాయి. అసలే పోస్ట్‌మార్టం రిపోర్ట్ లో ఏముంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
