తాజాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందారు కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు వదంతులు సృష్టించారు.. అనంతరం ఆయనది గుండెపోటుగా చెప్పారు. ఈ క్రమంలో కోడెలకు మరణానికి సంబంధించిన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడల ఆయన కొడుకు ఇంట్లోనే గొడవ పడ్డారని గొడవ అనంతరం కోడెల చనిపోయిన తరువాత శవాన్ని గంటపాటు ఇంట్లోనే పెట్టుకొని హాస్పిటల్ తీసుకు వెళ్లారట.. అది కూడా గుండెనొప్పి అని చెప్తూ దగ్గరలోని నిమ్స్ కి కాకుండా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన బసవతారకం హాస్పిటల్ కు తరలించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. కోడెల ఇంటి పక్కనే ఉన్న నిమ్స్ లేదా కేర్ హాస్పిటల్ కు కాకుండా దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ కు చెందిన బసవతారకం ఆసుపత్రికి తరలించడం పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయ. అయితే కోడెలను కావాలనే చంపేసి ఈ నాటకం ఆడుతున్నారని అనే అనుమానాలు కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఆస్తులు, కేసుల విషయంలో ఆయన కొడుకు, కూతురికి మధ్య తీవ్ర విబేధాలు వచ్చాయని ఈ క్రమంలోనే వారే చంపేశారనే అనుమానాలు కూడా ప్రస్తుతం రేకెత్తుతున్నాయి. ఆయన మరణంపై లోతైన దర్యాప్తు చేయాలని కోడెల అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
