ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందారు.. అయితే కోడెలా మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ముందుగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని వార్తలు వినిపించాయి, తరువాత గుండెపోటుతో మరణించారనే వార్తలు వినిపించాయి.. అయితే కోడెల ఇంటిపక్కనే ఉన్న నిమ్స్ హాస్పిటల్ కు కాకుండా టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ కు చెందిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ఎందుకు తీసుకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది కోడెల ఇటీవల తన సన్నిహితులతో మాట్లాడుతూ నేను స్పీకర్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాచేత అనేక అక్రమాలు చేయించాడు.. నేను, నా బిడ్డలు ఇప్పుడు ఆధారాలతో సహా పట్టుబడిన తర్వాత నన్ను తీవ్ర మనస్థాపానికి గురయ్యారట.
చంద్రబాబును నమ్మి మోసపోయా అని గత నాలుగురోజులుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాలలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. నర్సరావుపేట లోని ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు ఇదే విధంగా మాట్లాడుకుంటున్నారట.. మరోవైపు చనిపోవడానికి కొద్ది రోజుల ముందు చంద్రబాబుతో కోడెల మాట్లాడారట.. చంద్రబాబు రాజకీయంగా ఓడిపోవడంతోపాటు చంద్రబాబు అండతో తాను చేసిన అనేక అక్రమాల విషయంలో కేసులు నమోదుకావడంతో తనకు చంద్రబాబు అండగా లేరన్న బాధ ఎక్కువైందట.. అలాగే చంద్రబాబు ఆదేశాలతో, సూచనలతో అక్రమాలకు పాల్పడడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని, చివరికి మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామంటూ చంద్రబాబు తనతో చెప్పారని కోడెల సన్నిహితుల వద్ద వాపోయారట.. ఏదేమైనా నలభయేళ్ల సీనియర్ నాయకుడు ఈ విధంగా చనిపోవడం రాజకీయాలకతీతంగా అందరినీ కంటతడి పెట్టిస్తోంది.