టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూశారు. కోడెల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. కోడెలకు భార్య, ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యనారాయణ, కూతురు డాక్టర్ విజయలక్ష్మీ ఉన్నారు. అయితే కోడెల ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆస్పత్రికి తరలించారని తొలుత వార్తలు రావడం గమనార్హం. కొడుకు శివరాంతో గొడవ కారణంగానే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇక గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న ఆయన.. కొన్ని రోజులక్రితం గుండెపోటుకు గురయ్యారు. ఇక కే ట్యాక్స్ పేరుతో కోడెల కుమారుడు, కుమార్తె భూ దందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, కే ట్యాక్స్ వసూలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
