మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. మరోవైపు కోడెల గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు చెబుతున్నారు .. తాజాగా కోడెల మృతికి సంబందించి మేనల్లుడు కంచికి సాయి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్తికోసం కొడుకు శివరామే తండ్రిని హత్య చేశాడని అన్నారు. ఈమేరకు సత్తెనపల్లి డీఎస్పీకి పిర్యాదు చేసాడు. ఆ పిర్యాదు లేఖలో ఉన్న సమాచారం ప్రకారం గత ఆగష్టు నెలలో కోడెల సాయి కి ఫోన్ చేసి తన కుమారుడు కోడెల శివరామ్ మానసికంగా, శారరీకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తనపేరు మీద ఉన్న ఆస్థి మొత్తం శివరామ్ పేరిట మార్చకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని నాతో చెప్పారని అన్నాడు. ఇదే విషయంపై నన్ను నాలుగు సార్లు పిలిపించి తన కుమారుడు నుండి కోడెలకు ప్రాణహాని ఉందని, తనని కాపాడమని అడిగినట్టు అందులో రాసాడు. ఈ విషయంపై శివరామ్ కి నేను చెప్పినప్పటికీ తను పట్టించుకోలేదని అన్నారు. కోడెల శివ ప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన కుమారుడే అతన్నిచంపి లేదా చంపించి ఆ హత్యను ఆత్మహత్యగా సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడని మాకు అనుమానం ఉందని ఆ లేఖలో పెర్కున్నాడు.
