పాపికొండల విహారయాత్రకు వెళ్తూ వస్తున్న తూర్పుగోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేవీపట్నం వద్ద జరిగిన ఈప్రమాదం పై ఇప్పటికే అందరూ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిదిమంది చనిపోగా 27మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 24 మంది కోసం అగ్నిమాపక గజ్జి వేటగాళ్ల బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బోటు యజమాని ప్రమాదానికి గల కారణాన్ని వెల్లడించారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి భారీగా పెరిగిందని ఈ కారణంగా దేవీపట్నం మండలంలోకి వచ్చే సరికి వరద ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా ఫ్లోటింగ్ ఎక్కువైందని ఈసందర్భంగా బోటు డ్రైవర్ అదుపు చేయలేక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. తిరగబడిన ప్రాంతంలో భారీ సుడిగుండం ఉంటుందని దాంతో ఆ బోటుకు మళ్ళించడం లేదా పక్కకు తిప్పడం వంటివి చేసి ఉండవచ్చని, ఇలా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కోడిగుడ్ల వెంకటరమణ తెలిపారు. బోటులో 90మంది ప్రయాణికులు 150 మందికి లైఫ్ జాకెట్లు ఉన్నాయని తెలిపాడు. భోజన విరామ సమయంలో భోజనం చేసే సమయంలో లైఫ్ జాకెట్లు తీయడం వల్ల భారీ నష్టం జరిగిందని ఆయన తెలిపారు.