ఏపీ ప్రతిపక్ష టీడీపీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఈ రోజు సోమ వారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కొంతమంది ఏమో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులు ఏమో చేశారని ఆరోపిస్తున్నారు.
మరికొంత మంది ఆయన గుండెపోటుతో చనిపోయారని అంటున్నారు. అయితే టీడీపీ నేత,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి కోడెల శివప్రసాదరావు ఉరేసుకుని చనిపోవడం అవాస్తమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోడెల మెడపై గాట్లు ఉన్నాయి. పోస్టు మార్టం కోసం ఉస్మానీయ ఆసుపత్రికి పంపిస్తామని ఆయన అన్నారు. అయితే ఆయన మెడపై గాట్లు ఎలా వచ్చాయో.. ఎవరు పెట్టారో తెలియదని వ్యాఖ్యానించడం ఇప్పుడు కోడెల మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.