మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు వదంతులు సృష్టించారు. అనంతరం కొంత సమయానికి అది గుండెపోటు గా తేలింది. ఈ క్రమంలో కోడెల చేసిన కొన్ని విషయాలు వివాదాన్ని రేపుతున్నాయి. కోడెల కొడుకు ఇంట్లోనే గొడవ పడ్డారనే వార్తలు కూడా వస్తున్నాయి.దీంతో కోడెల డెత్ మిస్టరీగా మారుతుంది. కోడెల చనిపోయిన తరువాత శవాన్ని గంట పాటు ఇంట్లోనే పెట్టుకొని హాస్పిటల్ తీసుకు వెళ్లారట అది కూడా గుండె నొప్పి వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లాల్సిన నిమ్స్ కి కాకుండా బసవతారకం కు తరలించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల ఇంటి పక్కనే ఉన్న నిమ్స్ లేదా కేర్ హాస్పిటల్ కు కూతవేటు దూరంలో ఉన్నా కూడా దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆసుపత్రికి తరలించడంపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే చంపేశారా చంపేసి ఈ నాటకం ఆడుతున్నారు అనే అనుమానాలు కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ఆస్తుల విషయంలో కేసుల విషయంలో ఆయన కూతురే చంపేశారు అనే అనుమానాలు కూడా ప్రస్తుతం రేకెత్తుతున్నాయి.