నవ్యాంధ్ర మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయిన కోడెల శివప్రసాద్ గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. దీంతో టీడీపీ పార్టీలో విషాద చాయలు నెలకొన్నాయి.
ఆయన మృతికి పలువురు విచారం వ్యక్తం చేస్తోన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.