టాలీవుడ్ సెలబ్రిటీల జీవితం రాత్రి పూట ఎలా ఉండబోతుందో మంచు లక్ష్మి వివరించనున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులకు సెలబ్రిటీల జీవిత విషయాలు తెలుసుకోవాలని చాలా ఆశక్తి ఉంటుంది. వారికి ఎన్ని సమస్యలు, పనులు ఉన్నా దృష్టి మాత్రం సెలబ్రిటీల పైనే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 23 నుండి సెలబ్రిటీ టాక్ షో ప్రారంభం కానుంది. ఇలాంటి షోల్లో సెలబ్రిటీల వివరాలు, వారి లైఫ్ స్టైల్ లాంటివి తెలుసుకుంటాం. కాని ఇప్పుడు వచ్చే ఈ షోలో ఆ సెలబ్రిటీలు రాత్రి పూట ఏం చేస్తారు, పడుకున్న సమయంలో ఎలాంటి విషయాలు కోసం ఆలోచిస్తారు అనే ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. ఈ షోకి హోస్ట్ గా మంచు లక్ష్మి చేయనుంది. ఈ షో బాలీవుడ్ లో ఫూట్ అఫ్ విత్ స్టార్స్ కి తెలుగు వెర్షన్ లో ప్రారంభిస్తున్నారు.