వశిష్ట గోదావరిలో పర్యాటకానికి ప్రాంతానికి వెళ్లిన వారు గోదావరిలోనే జల సమాధి అయ్యారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులను పరామర్శిస్తారు. అయితే ఈ బోటును మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తిదని తెలుస్తోంది. ఇతనికి ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి.
ఇప్పటికే చాలాసార్లు సినిమా షూటింగులకు, గోదావరి పుష్కరాలకు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు, ఫైర్ వర్క్స్ చేయడానికి ఈ బోటును వినియోగించారు. అలాగు ఆంధ్రజ్యోతిలో ఈ వార్తను రాసినా కనీసం అధికారులను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారు. ప్రస్తుత తరుణంలో రాజకీయాలు మాట్లాడటం కంటే గత ప్రభుత్వంలో ప్రారంభించిన బోట్ ఎలాంటి పరిస్థితుల్లో నడుపుతున్నారు అనేది మానిటరింగ్ చేయకపోవడం, ఆంధ్రజ్యోతి వార్తరాసి వదిలేయకుండా కనీసం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉండిఉంటే బావుండేది అంటూ ఇక్కడ పలువురు బాధను వ్యక్త పరుస్తున్నారు.