ఓవైపు పడవ ప్రమాదం మరోవైపు కోడెల మరణంపై రాష్ట్రవ్యాప్తంగా విషాదకర పరిస్థితులు అలుముకుంటే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు పల్నాడులో హల్ చల్ చేసారు. గురజాలలో బహిరంగ సభ కోసం బయలు దేరిన కన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా గురజాల, మాచర్లలో బీజేపీ కేడర్ పై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదంటూ కన్నా నిరసనగా గురజాల బహిరంగ సభకు సిద్ధమయ్యారు. అయితే సభకు అనుమతి లేదని ముందుగానే వెల్లడించినా ఆయన వినలేదు..
దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని సత్తెనపల్లి గెస్ట్ హౌస్ కు తరలించారు. అలాగే గురజాలలో బీజేపీ సభకు అనుమతివ్వకపోవడంపై కన్నా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మూడునెలల్లో వైసీపీ ప్రభుత్వం తప్పులు చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అర్థమతుందన్నారు. కన్నాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున సత్తెనపల్లి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. పల్నాడులో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తాజాగా టీడీపీ 11న చలో ఆత్మకూర్ అంటూ టీడీపీ ఇచ్చిన పిలుపుతో టీడీపీ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేయగా ఈరోజు కన్నాను అరెస్ట్ చేయడం తో అక్కడి పరిస్థితులు చక్కదిద్దేందుకు పోలీసు యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అర్ధమవుతోంది.