చంద్రయాన్ -2లోని విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేయడానికి నాసాతో కల్సి ఇస్రో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో నాసాకు చెందిన లూనార్ రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశంలోకి వెళ్లి మరి అక్కడి ఫోటోలను తీస్తుంది. దీనివలన రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ కు చెందిన చాలా విషయాలు తెలిసే అవకాశముందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడాలి మరి చంద్రుడి ఉపరితలంపై కూలిందని భావిస్తున్న విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ వస్తాయా.. లేదా ..?
