టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ల విమర్శలకు తనదైన స్టైల్లో పదునైన పంచ్ డైలాగులతో, సెటైర్లతో కౌంటర్ ఇచ్చే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ విజయసాయిరెడ్డి… తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకుపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమల ఆధ్యర్యంలో పోలవరం ప్రాజెక్టు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే సీఎం జగన్ పోలవరం పనులలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా పోలవరం రివర్స్ టెండరింగ్‌కు వెళుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టులపై జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేయించారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ప్రభుత్వం కావాలనే కక్షగట్టి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిందంటూ.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ”కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా. రివర్స్ టెండర్లు, జ్యుడిషల్ కమిషన్ వల్ల ఫలితాలెలా ఉంటాయో తెలుస్తుంది. మీ వేల కోట్ల దోపిడీ కూడా బయట పడుతుంది. నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు. మేం ప్రజలకు జవాబుదారులం. పచ్చ దొంగలకు కాదు.” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌పై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మంచి నిర్ణయం సార్ గత ఐదేళ్లలో జరిగిన అన్ని స్కామ్ లు బయట పెట్టండి సార్.. ప్రజలకు తెలియాలి వాళ్లకు ఎల్లో మీడియా ఉంది అన్ని అబద్ధాలు చూపిస్తున్నారు..కొన్ని ఛానళ్లలో టీడీపీ వాళ్లతో డిబెట్స్ తప్పుడు వార్తలు ప్రజలకు చూపిస్తున్నారు… మీరు యాక్షన్ తీసుకోండి సార్ ఓ నెట్‌జన్ రిప్లై ఇచ్చారు. అయినదానికి కానిదానికి సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేసే దేవినేని ఉమకు ఒకే ఒక్క ట్వీట్‌తో విజయసాయిరెడ్డి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.