టాలీవుడ్ లో ప్రసారం అవుతున్నబిగ్‌బాస్ హౌస్‌లో మొదటి వారం నుంచి ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరన్నది బిగ్‌బాస్ కంటే ముందుగానే షోను చూసే ప్రేక్షకులకు తెలిసిపోతోంది. అయితే అవి ఊహాగానాల వరకు అయితే పర్లేదు కానీ.. అనధికారికంగా వచ్చే అధికార వార్త అవుతోంది. ఎలిమినేషన్ కాబోతున్నది వీరే అంటూ శనివారమే లీకవుతోంది. తాజాగా ఎనిమిదో వారంలో ఎలిమినేషన్‌కు గురయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది ముందే తెలిసిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి.. ఈ వారం బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వచ్చిన వారంలో తనను నామినేట్ చేసేందుకు వీలుండదు.. కాబట్టి రెండో వారంలో అందరూ ఒకే కారణంతో ఆమెను నామినేట్ చేసేశారు. దీంతో శిల్పా నిష్క్రమణ తప్పదనిపిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఖచ్చితంగా శిల్పనే అనే వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అయితే ఎలిమినేట్ అయిన విషయం అధికారికంగా తెలియాలంటే ఆదివారం నాడు షో ప్రసారమయ్యే వరకు ఆగాలి.
