కశ్మీర్‌లో వివాదాస్పద ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో పాకిస్తాన్ షాక్‌కు గురైంది. కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల్లో భారత్‌ను దోషిగా నిలబెట్టాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కుయుక్తులు ఫలించలేదు. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలన్నీ కశ్మీర్ భారత్ అంతర్భాగం అని..తేల్చి చెప్పాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత్‌పై యుద్ధం చేస్తామని, అణుబాంబులతో దాడులు చేస్తామని బీరాలు పలుకుతున్నాడు. కశ్మీర్ తర్వాత భారత్ తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పీవోకే ప్రజల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు పీవోకేలోని ముజఫరాబాద్‌కు వచ్చిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. బిగ్ జల్సా’ పేరిట నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవోకే తనకు ఘనస్వాగతం లభిస్తుందని ఆశించిన ఇమ్రాన్ కు అక్కడి ప్రజల నుంచి ఊహించని పరాభవం ఎదురైంది. “గో బ్యాక్ నాజీ..గో బ్యాక్ ఇమ్రాన్ అంటూ నినదించడమే కాకుండా, ‘కశ్మీర్ హిందుస్థాన్ సొంతం’ అంటూ పీవోకే ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించడంతో ఇమ్రాన్‌ఖాన్ షాక్ అయ్యాడు. భారత్‌పై పీవోకే ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన ఇమ్రాన్‌ఖాన్ ఘోర అవమానంతో తిరిగి పాక్‌కు వెళ్లిపోయాడు. గత కొంత కాలంగా పీవోకేలో పాకిస్తాన్ సైన్యం ఆగడాలతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా పీవోకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ పీవోకేలోని యువకులకు ఉగ్రవాదంపై మరలించడంలో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి వెళ్లాలంటూ పీవోకే ప్రజలు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిజానికి పీవోకే ప్రజలు భారత్‌లోనే ఉంటేనే తాము ప్రశాంతంగా జీవిస్తామని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు వెళ్లిన ఇమ్రాన్‌ఖాన్‌కు పీవోకే ప్రజలు బుద్ధి చెప్పారు. పీవోకేలో జరిగిన ఘోర అవమానంతో పాకిస్తాన్ పరువు పొగొట్టుకుంది. పీవోకే ప్రజలు భారత్‌కు మద్దతు పలుకుతున్నారు. ఒకవేళ పీవోకేలో భారత ప్రభుత్వం సైనిక చర్యకు దిగితే అక్కడి ప్రజలు సంపూర్ణంగా మద్దతు పలుకుతారనడంలో సందేహం లేదు.