నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాపికొండలు చూడటానికి వీళ్లు బయలు దేరినట్లు సమాచారం. అయితే ఈ పర్యాటకుల్లో చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించారని అధికారులు చెబుతున్నారు. వీటిని ధరించిన వాళ్లు మాత్రమే ఒడ్డుకు చేరారు. మిగతా వారి అచూకీకోసం అధికారులు ప్రయత్నాలు మమ్మురం చేస్తోన్నారు.
