గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు లెక్కలేనన్ని ఉన్నాయి.రైతులకు, పేదలకు చెందాల్సిన సొమ్ము మొత్తం నొక్కేసారు. రైతులను ఆశపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.పుల్లారావు, ఉమా, కోడెల ఇలా ప్రతీఒక్కరు తమ సొంత ప్రయోజనాలు కోసం ప్రభుత్వం సొమ్ము ఉపయోగించుకున్నారు. కొన్ని వేల కోట్లు రూపాయలు స్కామ్ చేసారు. రైతులకు కనీసం పనులుకు కూడా చెయ్యలేదు. ఈమేరకు బొండా ఉమాపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి..”కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా. రివర్స్ టెండర్లు, జ్యుడిషల్ కమిషన్ వల్ల ఫలితాలెలా ఉంటాయో తెలుస్తుంది. మీ వేల కోట్ల దోపిడీ కూడా బయట పడుతుంది. నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు. మేం ప్రజలకు జవాబుదారులం. పచ్చ దొంగలకు కాదు అని అన్నారు.