సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. కేవలం చంద్రబాబు భజన చేస్తున్నాడని చంద్రబాబు రాజకీయ వ్యతిరేకులను ఇష్టానుసారంగా తిరుగుతున్నాడనే కారణంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. జిల్లాలో కనీసం క్యాడర్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని దీనస్థితి సోమిరెడ్డిది.. అయితే చంద్రబాబు క్యాబినేట్ లో మంత్రిపదవి తీసుకునేందుకు జగన్ పై దారుణమైన ఆరోపణలు చేశాడు. జగన్ ను అనేకసార్లు సవాలుచేశాడు. చాలా సందర్భాల్లో జగన్ పేరును ప్రస్తావించకుండా ఏ1 అంటూ మాట్లాడేవాడు. అయితే ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి.. అన్న చందంగా సోమిరెడ్డి దారుణంగా ఓడిపోవడంతో పాటు టిడిపి ఘోర పరాజయం చవిచూసింది..
దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అనేక అక్రమాలపై కేసులు నమోదు చేస్తుంది.. ఈ నేపథ్యంలో సోమిరెడ్డిపై కేసు నమోదయింది.. చాలా సందర్భాల్లో సోమిరెడ్డి మాట్లాడుతూ తాను ఏ విధమైన అవినీతి చేయలేదని చెప్తూ జగన్మోహన్ రెడ్డి పై విపరీతమైన ఆరోపణలు చేసేవారు.. ఒక సందర్భంలో అసెంబ్లీలో కూడా ఇదే విధంగా ప్రవర్తించేవారు. దాంతో గతంలో కాకాణి గోవర్థన్ రెడ్డి చాలాసార్లు సోమిరెడ్డిని సోదిరెడ్డి అనేవారు.. అతను చేసిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చేవారు. అయితే పోలీసులు అధికారుల అండతో ఇవేమీ పట్టించుకోకుండా వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో ఉన్నప్పుడు సోమిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారు..
విపక్షాలపై దుర్భాషలాడే వారు. అయితే తాజా ఘటనతో సోమిరెడ్డి అరెస్టయ్యారు.. కొద్దిరోజుల భూ కబ్జా కేసులో సోమిరెడ్డికి నోటీసులివ్వగా తాను విచారణకు వస్తున్నానని అనుకూల మీడియాకు సమాచారం ఇవ్వడంతో సోమిరెడ్డి కోసం అందరూ పోలీస్ స్టేషన్ వద్ద వెయిట్ చేశారు. ఈ సందర్భంలో సోమిరెడ్డి తాను హాజరు కాకుండా ఇద్దరు లాయర్లను పంపించి ముందస్తు బెయిల్ కు అప్లై చేసారు.. నిజంగా సోమిరెడ్డి అవినీతి, అక్రమానికి పాల్పడ్డాడు కాబట్టే లాయర్లను పంపడంతో పాటు ముందస్తు బెయిల్ కు ప్రయత్నించారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా కర్మ ఫలం అంటే ఇదేనేమో ఏ నోటితో అయితే ఏ1 అన్నాడో ఇప్పుడు అదే విధంగా తనపై కేసు నమోదు కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.