ఏపీలోని వైసీపీ ప్రభుత్వం,పాలన విషయంలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేస్తుంటే…తెలిసి తెలియని మరికొందరు అసంతృప్తితో విమర్శలు చేస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేశారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతూ. ఇప్పటివరకు చంద్రబాబు దిగజారిపోతున్న విలువలు లేని రాజకీయాలు చూసి చలించిపోయానని, సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మా వద్ద ఉందని పవన్ అన్నారు. వైసీపీ మేనిఫెస్టో జనహితంగా ఉంది.. కానీ, పాలనే అందుకు విరుద్ధంగా ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. ‘ వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా తీసుకొచ్చారని పవన్ అన్నారు.
