అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ షాపింగ్ హవానే నడుస్తుంది. వీటివల్ల బయటకు వెళ్లి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ లోనే షాపింగ్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మల్లా జనాలు ఆకర్షితులు అయ్యేలా ఆఫర్స్ మరియు డిస్కౌంట్ లు కూడా ఇస్తారు. మామోలు రోజుల్లోనే ఇలా ఉంటే ఇక పండుగలు వస్తే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. రానున్న రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. దాంతో మరిన్ని మంచి ఆఫర్స్ ఇవ్వాలని ఈ-కామార్స్ సంస్థలు నిర్ణయించుకున్నాయి. అయితే వీటికి చెక్ పెడుతూ సీఏఐఎఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పండగలకు వారు ఇస్తున్న డిస్కౌంట్ మరియు ఆఫర్స్ ను నిషేదించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇలా ఆఫర్స్ ఇవ్వడం వల్ల మామోలు వ్యాపారులకు పెద్ద దెబ్బ అని, అది వ్యపారానికే విరుద్ధమని చెప్పారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి లేక రాయడం జరిగింది.