రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. వాహన దారులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పత్రాల పేరుతో జరిమానాలు విధించకుండా వారితో హెల్మెట్స్ కొనించాలని, మిగితా ధృవ పత్రాలు పొందేలా ప్రయత్నం చేస్తున్నారు. డీజీపీ, రాచకొండ కమిషనర్ ఆదేశాలతో.. ఈ కొత్త నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే రాచకొండ పోలీసుల చేస్తున్న ఈ ప్రయత్నం మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. పోలీసులు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. మంచి ప్రయత్నం అని మెచ్చుకున్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేటి నుండి Traffic Police ల వినూత్న ప్రయత్నం డీజీపీ, రాచకొండ సీపీ ఆదేశానుసారం #TrafficChallan వేయకుండా Helmet Insurance Pollution Licence లేని వారికి వాహన దారులతో కొనిచ్చే ప్రయత్నాన్ని నేటి నుండి మొదలు పెట్టినట్లు ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ రావు అన్నారు. pic.twitter.com/OPj1EG0g1v
— Rachakonda Police (@RachakondaCop) September 14, 2019